దాయాది పాకిస్తాన్ నిన్న రాత్రి వందల డ్రోన్లతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్.. వందల సంఖ్యలో డ్రోన్లను భారత్ భూభాగంలోకి పంపించింది. వాటిని ఇండియర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్ధవంతంగా నేలకూల్చింది.
అయితే, పాక్ పాల్పడిన దాడులపై భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ శనివారం ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. పాకిస్తాన్ అర్ధరాత్రి 1.40 గంటలకు హై స్పీడ్ మిస్సైల్‌తో పంజాబ్ ఎయిర్ బేస్ మీద దాడి చేయడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. పాక్ అనేక డ్రోన్లు, లాంగ్ రేంజ్ వెపన్స్, సాయుధ విమానాలతో LOC వద్ద దాడి చేయగా.. వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పి కొట్టిందని తెలిపింది.