భారత్ – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది. భారత్ – పాకిస్తాన్ సంయమనం పాటించాలని కోరిన చైనా.. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. సమస్యను ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచనలు చేసింది. ఈ సమస్యకు ముగింపు పలికేందుకు అవసరమైతే నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు సిద్ధమన్న చైనా.. కీలక ప్రకటన చేసింది.

ఇది ఇలా ఉండగా భారత్ – పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో సీపీఐ నారాయణ కామెంట్స్ వైరల్ గా మారాయి. పాకిస్థాన్ కు చైనా సహాయం చేస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అని బాంబు పేల్చారు. గతంలో మాట్లాడిన నావ్యాఖ్యలను అపార్దంళచేసుకొని నన్ను పాకిస్థాన్ ఏజెంట్ అని అంటున్నారన్నారు. భార్య కల్లముందు కాల్లపారాణి ఆరకముందే కట్టుకున్న భర్తలను చంపిన ఉగ్రవాదులపై ఇండియన్ ఆర్మి ధాడులు చేయడాన్ని నేను తప్పు పట్టలేదని వెల్లడించారు. సామాన్య ప్రజలపై దాడులు చేయడాన్నిమాత్రమే నేను తప్పుపట్టానన్నారు సీపీఐ నారాయణ.