భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితులపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసార స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘యుద్ధం విరమించాలని నేను అంటే నారాయణను పాకిస్తాన్ పంపాలని బీజేపీ నాయకులు అన్నారు. POK ఆక్రమించకుండా ఎందుకు శాంతి చర్చలకు వెళ్ళారు? ఇప్పుడు మోదీని పాకిస్తాన్ పంపాలా?
ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రమాదకరం. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కావలసిన ఏర్పాట్లు చేయాల్సిందే. భారత్ పాకిస్తాన్ నడుమ యుద్ధ విరమణ శాంతి చర్చలను స్వాగతిస్తున్నాం. ఉగ్రవాదుల పైన దాడి చేయమని చెప్పినదానికి మమల్ని అపార్థం చేసుకుంటారా? దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. ఇదిలాఉండగా, పాకిస్తాన్ నిన్న కాల్పుల విరమణకు ఒకే చెప్పి సాయంకాలానికి తిరిగి కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే.