ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సెషన్ నిర్వహించాలని రాజ్యసభ కాంగ్రెస్ ప్రతిపక్ష నేత, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రధాని మోడీకి మరోసారి లేఖ రాశారు. పహెల్గామ్ ఉగ్రవాద దాడి, అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ మీద ఉభయ సభల్లో చర్చ జరపాలన్నారు.
ఏప్రిల్ 28న తాను రాసిన లేఖను గుర్తుచేస్తూ మరో లేఖను రాశారు. కాల్పుల విరమణ ప్రకటనపైనా చర్చించాలని లేఖలో పేర్కొన్నారు. అందుకోసం ప్రతిపక్షాల ఏకగ్రీవ అభ్యర్థనను పునరుద్ఘాటిస్తూ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీకి లేఖ ద్వారా విన్నవించారు. తన రిక్వెస్ట్ పై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందిస్తారని.. తనకు నమ్మకం ఉందని లేఖలో ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు.