ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 15 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు నాదెండ్ల మనోహర్. జాతీయ ఆహార భద్రత చట్టం కింద సరుకులు పంపిణీ చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కోటి 46 లక్షల 21 వేల రైస్ కార్డులు అందించామని ప్రకటించారు మంత్రి నాదెండ్ల మనోహర్.

ఆంధ్రప్రదేశ్ 95 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారని పేర్కొన్నారు. నూతనంగా 10,747 మంది కార్డులు పొందారన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
దేవాదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సాప్‌లో 95523 00009 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఈ సేవలకు గాను గత అక్టోబర్ ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది.