ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… టీచర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ లకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ప్రస్తుతం గంటకు ఇస్తున్న 150 రూపాయల జీతాన్ని 375 లకు పెంచుతున్నట్టు వెల్లడించింది. అలాగే నెలకు అత్యధికంగా 27 వేల రూపాయల జీతం నిర్ణయించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.