ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో… పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఇండియా చేతిలో చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ కు ప్రకృతి కూడా సహకరించడం లేదు. మొన్న యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోనే.. భూకంపం పాకిస్తాన్ లో సంభవించింది. తాజాగా మరోసారి ఆ దేశాన్ని భూకంపం కుదిపేసింది.

ఇవాళ మధ్యాహ్నం 1.26 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. అయితే, భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. కాగా.. శనివారం కూడా పాక్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దింతో పాకిస్థాన్ ప్రజలు వణికిపోతున్నారు.