ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ప్రారంభమైన రోజు భారత జవాన్ ను పట్టుకున్న పాకిస్తాన్… తాజాగా అతన్ని ఇండియాకు అప్పగించేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. పాకిస్తాన్ రేంజర్ల అదుపులో ఉన్న బిఎస్ఎఫ్ పూర్ణం కుమార్ షా ను తాజాగా పాకిస్తాన్ ఇండియాకు అప్పగించేసింది.

అటారి వాఘా బార్డర్ ద్వారా… అతన్ని ఇండియాకు పంపించింది. ఇక గత నెల 23వ తేదీన పాకిస్తాన్ సరిహద్దుల్లోకి అనుకోకుండా జవాన్ పూర్ణం కుమార్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన భర్త తిరిగి వచ్చేలా చూడాలని ఆయన భార్య కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే రంగంలోకి దిగిన కేంద్ర సర్కార్… పాకిస్తాన్ దేశంతో చర్చలు జరిపి అతన్ని తీసుకువచ్చింది.