తెలంగాణలో రెండో రోజు సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. కాళేశ్వరం పుష్కరాలకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు చేశారు. ఇక నిన్న కాళేశ్వరం పుష్కరాలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. నదులు మన నాగరికత మాత్రమే కాదు.. నదిని మనం దేవుడిగా భావిస్తామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

సరస్వతీ పుష్కరాలు నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపారు. రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణా నది పుష్కరాలు నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మంథని నియోజకవర్గాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ ఛానల్ ద్వారా రూ.200 కోట్లు నిధులు ఇస్తున్నట్లు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.