హర్యాణాలో పాక్ ISI ఏజెంట్‌గా పనిచేస్తున్న మహిళ అరెస్ట్ ఐంది. హర్యాణాలో యూట్యూబర్ జ్యోతిరాణి అరెస్ట్ అయ్యారు. పాక్ ISI ఏజెంట్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించి… హర్యాణాలో యూట్యూబర్ జ్యోతిరాణి అరెస్ట్ చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్ కు చేరవేసింది జ్యోతి.

జ్యోతితో పాటు మరో ఆరుగురు అరెస్ట్ అయ్యారు. ట్రావెల్ వీసా మీద పాక్‌లో పర్యటించి సమాచారాన్ని చేరవేసిన జ్యోతిని హర్యాణాలో అరెస్ట్ చేశారు. ఇక అటు హర్యానాలో పాక్ గూఢచారిగా పనిచేస్తున్న విద్యార్థి దేవేంద్రసింగ్ అరెస్ట్ అయ్యాడు. 2024 లో కర్తార్‌పుర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్ వెళ్లి, అక్కడ ఐఎస్ఐ నిఘా అధికారిని కలిశాడని ఆరోపిస్తున్నారు పోలీసులు.
హర్యానా రాష్ట్రం పటియాలలో పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి దేవేంద్ర సింగ్ (25), తన ఫేస్‌బుక్ లో గన్, పిస్టల్ ఫొటోలు పోస్ట్ చేయడంతో అతనిపై నిఘా పెట్టి పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తున్నాడని నిర్ధారించారు పోలీసులు. హానీట్రాప్ ద్వారా దేవేంద్ర సింగ్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుంది పాకిస్తాన్ ఐఎస్ఐ. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనిక స్థావరాల వివరాలను, ఇతర రహస్యాలను దేవేంద్ర సింగ్ పాకిస్తాన్‌కు అందించినట్టు పేర్కొన్నారు పోలీసులు.