గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులు జమ అవ్వకపోవడానికి కారణాలు ఇవే..!

-

ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను తీసుకురావడం సహజమే. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ ను ఉచితంగా అందించే విధంగా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. అయితే కొంతమంది ఈ డబ్బులను అందుకోవడం లేదు. ఈ ఆలస్యం జరగడానికి సాంకేతిక సమస్యలే కారణమని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాకుండా ఆధార్ కార్డు లింక్ లేకపోయిన వారు, అలాగే కెవైసి పూర్తి చేయని వారికి ఈ డబ్బులు అందడానికి కొంత సమయం పడుతుంది.

ఇలాంటి సందర్భాల్లో త్వరలోనే డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా సంవత్సరానికి సరిపడా డబ్బులను ఒకే సమయంలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్‌లను ఉచితంగా అందజేస్తోంది. అయితే లబ్ధిదారుల ఖాతాల్లో మొదటి సిలిండర్‌కు సంబంధించిన డబ్బులు జమ చేయబడినప్పటికీ, రెండు సిలిండర్‌లకు సంబంధించిన రాయితీ డబ్బులకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీని వల్ల గ్యాస్ రాయితీ డబ్బులు అందలేదని లబ్ధిదారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు.

మొదటి విడతలో డబ్బులు పొందినవారికి రెండవ విడతలో ఖచ్చితంగా డబ్బులు అందుతాయని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యల వల్ల నిధుల విడుదల ఆలస్యమైందని పేర్కొన్నారు. పైగా వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తయి నిధులు జమ అవుతాయని చెప్పారు. గతంలో కొంతమంది లబ్ధిదారులు డబ్బులను పొందలేకపోయారు, అటువంటి వారు తమ కెవైసి మరియు బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేయించుకోవాలి అని సూచిస్తున్నారు. కాబట్టి ఖాతాలో డబ్బులు జమ కాకపోతే లబ్ధిదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news