హైదరాబాదులోని పాతబస్తీ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం పైన తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. పాతబస్తీ మీర్ చౌక్ లో… భారీ అగ్ని ప్రమాదంలో… పలువురు మరణించడం… తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.
సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని…అధికారులను ఆదేశించానని వెల్లడించారు. కాగా హైదరాబాద్ లోని పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందారు. అటు మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. DRDO ఆసుపత్రిలో మరో ముగ్గురు మృతి చెందారు.