కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 11కి మృతుల సంఖ్య చేరినట్లు పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇద్దరు చిన్నారులు ప్రాచి(6), ప్రథమ్ (13) మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో మరోసారి జరగకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు కిషన్ రెడ్డి. ఫైర్ డిపార్ట్మెంట్కు సంబంధించి ఎక్విప్మెంట్స్ పెంచాలని సూచనలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మృతులు అభిషేక్ మోడీ(30), ఆరుషి జైన్(17), హర్షాలీ గుప్తా(7), శీతల్ జైన్(37), రాజేందర్ కుమార్(67), సుమిత్ర(65), మున్నీబాయ్(72), ఇరాజ్(2) గా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.