కన్నీరు పెట్టుకున్న మంచు మనోజ్

-

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కన్నీరు పెట్టుకున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌తో పాటు తాను నటించిన ‘భైరవం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు మంచు మనోజ్. సినిమా తప్ప తనకు ఏమీ తెలియదంటూ ఎమోషనల్ అయ్యారు మనోజ్. కొంతకాలంగా తన జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని తెలిపారు మనోజ్.

manchumanoj
Tollywood hero Manchu Manoj sheds tears

కట్టుబట్టలతో తనను రోడ్డుపై నిలబెట్టారని, ఆ సమయంలో అభిమానులే తనకు అండగా నిలబడ్డారని కంటతడి పెట్టుకున్నారు. కట్టె కాలే వరకు తాను మోహన్ బాబు అబ్బాయినేనని.. తండ్రి నేర్పించిన క్రమశిక్షణతోనే ముందుకు సాగుతానని వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news