భార్యాభర్తల మధ్య ఉండే ఏజ్ గ్యాప్ కీలకమైన అంశమా..?

-

ప్రతి ఒక్కరూ జీవితంలో పెళ్లి ఎంతో పవిత్రమైన బంధం అని చెబుతూ ఉంటారు. వివాహం తర్వాత భార్య భర్తలు ఇద్దరూ వివాహాన్ని ఏడు జన్మల బంధంగా నమ్ముతారు. కాకపోతే భారతీయ సమాజంలో వివాహం పట్ల దృక్పథం మారుతూ వస్తుంది. ప్రస్తుతం చాలా మంది ప్రేమ వివాహం ఆకర్షితులుగా మారుతున్నారు. వివాహానికి సంబంధించిన వయసుకు ఎటువంటి పరిమితులు లేవు అని కొంతమంది భావిస్తారు. సచిన్ టెండుల్కర్ తన భార్య అంజలి కంటే నాలుగు సంవత్సరాలు చిన్నవాడు. హిందూ శాస్త్రీయం ప్రకారం, భార్యా భర్తల మధ్య వయసు తేడా ఉండాలని పేర్కొనబడింది.

అయితే శాస్త్రంలో వివాహంకు సంబందించిన వయస్సు గురించి నేరుగా చెప్పకపోయినా, స్త్రీ పురుషుల శారీరక సంబంధానికి కనీస వయస్సును పేర్కొనడం జరిగింది. స్త్రీ పురుషులు శరీరంలో హార్మోనల్ మార్పుల వల్ల శారీరక సంబంధానికి సిద్ధం అవ్వడం జరుగుతుంది. స్త్రీలు 7 నుంచి 13 సంవత్సరాల మధ్య, పురుషులు 9 నుంచి 15 సంవత్సరాల మధ్య ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ విధంగా స్త్రీలు పురుషుల కంటే త్వరగా సిద్ధమవుతారు. అయితే శరీరంలో హార్మోనులలో మార్పులు జరిగినా, వివాహం చేసుకోవాలని ఎక్కడా పేర్కొనలేదు.

భారతదేశంలో స్త్రీలకు 18, పురుషులకు 21 సంవత్సరాలుగా వివాహానికి చట్టపరమైన కనీస వయస్సును నిర్ణయించారు. దీని ప్రకారం, భార్యాభర్తల మధ్య మూడేళ్ల వయసు వరకు తేడా సాధారణంగా ఉంటుందని భావిస్తారు. అయితే కొంతమందిలో ఈ వ్యత్యాసం 10 నుండి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. భార్య భర్త కంటే చిన్నగా ఉండాలని చాలా మంది అభిప్రాయపడతారు. ప్రస్తుతం చట్టపరంగా చేసిన మార్పులలో స్త్రీల కనీస వయస్సును 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అయితే, దీనిని ఇంకా పూర్తిగా అనుసరించడం లేదు. అందువలన, వయస్సు అనేది వివాహానికి సంబంధించిన ఒక అంశం మాత్రమే. భార్యాభర్తల మధ్య ఉండే సంబంధం ప్రేమ, ఆప్యాయత వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news