రాజ్ భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురిచేసాడు రాజభవన్ ఉద్యోగి.. రాజ్ భవన్ లో చోరీ కేసులో నిందితుడిని రెండుసార్లు అరెస్ట్ చేశారు పంజాగుట్ట పోలీసులు. మార్ఫింగ్ ఫొటోలో మొదటి సారి కాగా, రాజభవన్ లోని హార్డ్ డిస్క్ చోరీ కేసు లో రెండో సారి అరెస్ట్ అయ్యాడు. సస్పెండైనా సెక్యూరిటీని మాయ చేసి నైట్ టైం లో ఎంట్రీ ఇచ్చాడు.

ఆ ఉద్యోగి వారంలో రెండు సార్లు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది..రాజ్ భవన్ లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ తన తోటి మహిళకు కొన్ని మార్ఫింగ్ ఫోటో లను చూపించాడు..ఎవరో నాకు ఈ ఫోటోలు పంపిస్తున్నాడు జాగ్రత్త అని చెప్పాడు..ఇంకా చాలా ఫోటోలను నా సిస్టం కు కూడా పంపించడానికి భయపెట్టాడు.. దీంతో కలవరానికి గురైన మహిళ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.