ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులపై అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. రేషన్ కార్డులలో పేరు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని… ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక ప్రకటన చేశారు. ఇకపై.. పెళ్లి కార్డు పెట్టాల్సిన పనిలేదని తెలిపారు. చాలా చోట్ల… దరఖాస్తుదారులను పెళ్లి కార్డు అడగడం పై… ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించడం జరిగింది.

భార్య భర్తలు ఇద్దరూ విడిపోయి ఏడేళ్లు దాటితే సింగల్ మెంబర్ కార్డులు కూడా ఇస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణలో నెలకొన్న కొన్ని సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే రేషన్ కార్డుల దరఖాస్తు గడవు పొడగిస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. అదే సమయంలో రేషన్ కార్డులలో పేరు చేర్చుకునేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని క్లారిటీ ఇచ్చారు.