ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని టీచర్లకు బిగ్ అలర్ట్. టీచర్ల బదిలీలపై సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. టీచర్ల బదిలీపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హెడ్మాస్టర్లు ఐదు సంవత్సరాల పాటు, టీచర్లు 8 సంవత్సరాల పాటు సర్వీస్ పూర్తయితేనే తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని స్పష్టం చేసింది కూటమి ప్రభుత్వం.

కేటగిరి 1 కి ఒక పాయింట్, కేటగిరి 2కి రెండు పాయింట్లు ఇస్తారు. కేటగిరి 3 కి మూడు పాయింట్లు అలాగే కేటగిరి 4కి నాలుగు పాయింట్లు లభిస్తాయి. ఇక ఈనెల 31వ తేదీ నాటికి ఖాళీలు, రిటైర్డ్ అయ్యే స్థానాలు, తప్పనిసరి బదిలీలు సహా అన్ని వివరాలు వెబ్సైట్లో ఉంచింది. దాని ప్రకారం టీచర్ల బదిలీలు కొనసాగుతాయి.