తండ్రి కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సింది… 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేదని పేర్కొన్నారు. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యామని.. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేదని తండ్రి కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు.

భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారు… నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ అంటూ కవిత పేర్కొన్నారట. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో.. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లిందని తండ్రి కేసీఆర్ కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. అయితే ఇందులో ఎంత మేరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.