మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మృతి.. కేసీఆర్ కీలక ప్రకటన

-

మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ మరణం దిగ్భ్రాంతికరం: సంతాపం ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఖమ్మం జిల్లా వైరా మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బానోత్ మదన్‌లాల్ మరణం పట్ల కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

KCR expressed condolences on the death of Banoth Madanlal, former MLA from Khammam district and senior BRS leader.
KCR expressed condolences on the death of Banoth Madanlal, former MLA from Khammam district and senior BRS leader.

మదన్‌లాల్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. మదన్‌లాల్ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కాగా వైరా మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్ కన్నుమూసారు. గుండెపోటుతో ఎ.ఐ.జీ హాస్పిటల్ లో వైరా మాజీ ఎమ్మెల్యే మధన్ లాల్ మరణించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి బిఆర్ఎస్ లో చేరారు మదన్ లాల్. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మదన్ లాల్. ప్రస్తుతం బిఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇంఛార్జి గా ఉన్న మదన్ లాల్…. గుండెపోటుతో ఎ.ఐ.జీ హాస్పిటల్ లో మరణించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news