చాహల్ తో విడాకులు… ధన శ్రీ వర్మ సంచలన కామెంట్స్

-

బాలీవుడ్ ప్రముఖ నటి, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ధనశ్రీ ప్రముఖ క్రికెటర్ చాహల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకులు తర్వాత ధనశ్రీ అనేక రకాల ట్రోల్స్ బారిన పడింది. తనపై చాలామంది నెగిటివిటిని ప్రచారం చేశారు. చాలా కాలం పాటు ధనశ్రీ వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది. తాజాగా ఆ వార్తలపై ధన శ్రీ స్పందించారు.

chahal
chahal

ఒక వ్యక్తిని అనగదొక్కాలని చూడడం తన పద్ధతి కాదని ఇలా చేస్తే జీవితంలో ఎప్పటికీ ఎదగలేదని ధనశ్రీ అన్నారు. క్రమశిక్షణ మనం నమ్మిన సిద్ధాంతాలే జీవితంలో ముందుకు తీసుకెళ్తాయని చెప్పారు. ప్రస్తుతం ధనశ్రీ తన పని కెరీర్ మీదే పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రేమ గురించి ఎలాంటి ఆలోచనలు చేయడం లేదని… జీవితంలో ప్రేమ పొందాలని ఎవరు అనుకోరంటూ ధనశ్రీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ధనశ్రీ చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news