చైనాలో హాగ్ చేసుకోవడానికి అమ్మాయిలు అబ్బాయిలకి డబ్బులు ఇస్తున్నారు. మ్యాన్ మమ్స్ అనే ఓ విచిత్రమైన సాంప్రదాయం చైనాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా అమ్మాయిలు అబ్బాయిలకు డబ్బులు ఇచ్చి మరి హగ్ చేసుకుంటున్నారు. అమ్మాయిలు ఒత్తిడికి గురైన సమయంలో మానసిక ప్రశాంతత పొందడానికి ఈ విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఐదు నిమిషాల పాటు హగ్ కోసం అబ్బాయిలు 50 యువాన్లు అంటే 600 రూపాయలు తీసుకుంటున్నారు.

ఈ విధానం చైనాలో విపరీతంగా కొనసాగుతోంది. హగ్గింగ్స్ మాల్స్, సబ్వే స్టేషన్ లాంటి బహిరంగ ప్రదేశాలలో ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఈ ట్రెండ్ వల్ల అనేక రకాల భిన్నాభి ప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తే మరి కొంత మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సాంప్రదాయాలు ఇండియాకు మాత్రం తీసుకురాకండి అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.