ఎటువంటి శుభకార్యము లేక పూజ అయినా ముందుగా దీపారాధనతో అందరూ ప్రారంభిస్తారు. అయితే దీపాన్ని వెలిగించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే దీపారాధన చేసి పూజను ప్రారంభిస్తారో ఎంతో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే పుట్టిన రోజున చాలా మంది కేక్ కటింగ్ చేసి కొవ్వొత్తిని ఆర్పుతూ ఉంటారు. అయితే ఈ విధంగా మంటను ఆర్పకూడదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైతే శుభకార్యాలలో ఈ విధంగా చేస్తారో అది ప్రతికూల శక్తిని పెంచుతుంది అని పండితులు చెబుతున్నారు. కనుక మంచి ఫలితాలను పొందాలంటే జ్యోతిష్య శాస్త్రం లో చెప్పిన నియమాలను పాటించాలి.
పంచ భూతాలలో అగ్ని ఎంతో శక్తివంతమైనది మరియు పవిత్రమైనది. కనుక శుభకార్యాల్లో లేదా పూజల్లో దీపారాధనతో ప్రారంభించడం జరుగుతుంది. అటువంటి సమయంలో దీపాలను లేక కొవ్వొత్తులను ఆర్పడం వలన శుభకరం కాదు అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యాస్త సమయంలో కేక్ కోయడం మరియు కొవ్వొత్తులను ఆర్పడం వలన సానుకూల శక్తి తగ్గిపోతుంది. వాటికి బదులుగా, పుట్టిన రోజున దుస్తులు లేదా సామాన్లను అవసరమైన వారికి ఇవ్వడం వలన ఎంతో మంచి జరుగుతుంది లేదా మొక్కలను నాటడం వంటివి కూడా చేయవచ్చు.
ఇటువంటి మంచి పనులను పుట్టిన రోజున చేస్తే ఎంతో పుణ్యం కూడా వస్తుంది. అంతేకాకుండా కేక్ కోయడానికి చాకును ఉపయోగించకూడదు. చాకుకు బదులుగా స్పూన్ తో కేక్‌ను కోసి అందరికీ పంచవచ్చు. అలాగే కొవ్వొత్తులను ఆర్పకుండా, కేక్ పక్కన వాటిని వెలిగించి పుట్టినరోజు జరుపుకోవచ్చు. తర్వాత ఆ కొవ్వొత్తిని దేవుడి మందిరంలో ఉంచవచ్చు. ఈ విధమైన మార్పులను చేయడం వలన ప్రతికూల శక్తిని తగ్గించుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కనుక పుట్టిన రోజున ఇటువంటి పనులను చేయకుండా ఉండాలి.