హీరో శ్రీరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అనేక సినిమాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. హీరో శ్రీరామ్ పై డ్రగ్స్ కేసు నమోదు అయింది. ప్రస్తుతం శ్రీరామ్ ను చెన్నైలో పోలీసులు విచారిస్తున్నారు. అతని నుంచి బ్లడ్ శాంపిల్స్ ఇప్పటికే స్వీకరించారు. మాజీ DMK నేతనుంచి ఆయన డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి.

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల విచారణలో హీరో శ్రీరామ్ ఉన్నారు. విచారణ అనంతరం అసలు విషయం బయటికి రానుంది.