లవ్ రివేంజ్.. ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది ఓ కిలాడీ లేడీ. చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసి, డెలాయిట్‌లో సీనియర్ రోబోటిక్స్ కన్సల్టెంట్‌గా పని చేస్తోన్న రెనే జోషిల్డా అనే యువతి… బెంగళూరులో దివిజ్ ప్రభాకర్ అనే సహోద్యోగితో పరిచయం.. ప్రేమ వ్యవహారం నడిపించింది. ప్రేమంటే ఇష్టం లేని ప్రభాకర్.. రెనే జోషి ప్రతిపాదనను తిరస్కరించి మరొకరిని వివాహం చేసుకున్నాడు.

దీంతో ప్రభాకర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ పెద్ద ప్లాన్ వేసిన రెనే… 11 రాష్ట్రాల్ని వణికించింది. దివిజ్ ప్రభాకర్ పేరుతో నకిలీ ఈ-మెయిల్ ఐడీలు సృష్టించి దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ స్కూళ్లు, ఆస్పత్రులు, స్టేడియంలకు బాంబు బెదిరింపులు చేసింది. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనలో సైతం రెనే ఓ బెదిరింపు మెయిల్ పంపినట్లు గుర్తించిన పోలీసులు… రెనే జోషిల్డాను అదుపులోకి తీసుకున్నారు.