టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో విషాదం !

-

ప్రముఖ సినీ నటి సనా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తన తల్లి సయీదా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో సనా ఖాన్ తన తల్లిని తలుచుకుంటూ ఇన్ స్టాలో ఫుల్ ఎమోషనల్ అవుతూ పోస్ట్ షేర్ చేసుకున్నారు. నా ప్రియమైన తల్లి అనారోగ్య సమస్యలతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు చేరుకుంది అని పోస్ట్ చేసింది.

Sana Khan's mother Saeeda passes away after long illness
Sana Khan’s mother Saeeda passes away after long illness

ప్రస్తుతం సనా ఖాన్ షేర్ చేసుకున్న ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా సనా ఖాన్ కు చాలామంది సినీ ప్రముఖులు, ఆమె అభిమానులు సానుభూతి తెలుపుతున్నారు. కాగా, సనా ఖాన్ తెలుగులో కళ్యాణ్ రామ్ కత్తి, గగనం, మిస్టర్ నూకయ్య లాంటి సినిమాలలో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ కొనసాగిస్తుంది. 2020లో సనా ఖాన్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news