జుట్టు రాలడాన్ని నివారించాలా? అయితే ఈ చిట్కాను కచ్చితంగా ప్రయత్నించాల్సిందే..!

-

మహిళలు జుట్టు సంరక్షణ కోసం ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. పైగా పొడవాటి జుట్టు కోసం ఎన్నో డబ్బులను కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. కాకపోతే జుట్టును కాపాడుకోవడానికి ఎంత సమయాన్ని కేటాయించిన సరేనా ప్రయోజనం ఉండదు. కనుక ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే జుట్టును సంరక్షించుకోవడానికి ఈ చిట్కాలను ప్రయత్నించండి. ఈ మధ్యకాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అనే చెప్పవచ్చు. ముఖ్యంగా చిన్న వయసు నుండే జుట్టు రాలడం ఒక పెద్ద సమస్యగా మారింది.

ఎప్పుడైతే జీవన శైలి మరియు ఆహారంలో మార్పులను చేస్తారో, జుట్టు దృఢంగా ఉంటుంది. జుట్టు రాలడానికి ఎన్ని షాంపూలు, సిరం లు, నూనెలు వంటివి ఉపయోగించినా, తీసుకునేటువంటి ఆహారం కూడా ఎంతో అవసరం. కనుక ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పాటుగా కొన్ని రకాల చిట్కాలను ప్రయత్నించి చూడండి. ఇలా చేయడం వలన జుట్టు దృఢంగా మారుతుంది. జుట్టు పెరుగుదలకు బియ్యం నీరు ఎంతో ఉపయోగపడుతుంది. బియ్యం లో ఉండే పోషకాలు జుట్టు ఎదుగుదలకు ఎంతో సహాయం చేస్తాయి. కనుక బియ్యం నీరు ను ఉపయోగించి జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోండి.

దీనికోసం నానబెట్టిన బియ్యాన్ని మరియు నీళ్లను వేరు చేసి, ఆ నీటిలో సగం ఉల్లిపాయను కోసి కలపాలి. దీనిలో ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసి, ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద ఐదు నిమిషాలు మరిగించాలి. ఇలా నీటిని మరిగించిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిశ్రమాన్ని మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును కడగాలి. ఇలా చేయడం వలన జుట్టు ఎదుగుదలకు సహాయపడుతుంది. కనుక ఇటువంటి ఎంతో సులభమైన చిట్కాలతో ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news