టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో పోకిరి లాంటి ఎన్నో సినిమాలు చేసి మంచి.. ఊపులో కనిపించారు ఇలియానా. కానీ ఆ తర్వాత హీరోయిన్ ఇలియానా… అడ్రస్ ఇండస్ట్రీలో లేకుండా పోయింది. మైఖేల్ అనే వ్యక్తితో…. పెళ్లి కాకముందే సహజీవనం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే… తాజాగా అదిరిపోయే శుభవార్త చెప్పింది హీరోయిన్ ఇలియానా.

రెండోసారి తల్లి అయినట్లు పేర్కొంది. ఈ మెదక్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. జూన్ 19వ తేదీన… కుమారుడు పుట్టినట్లు వెల్లడించింది. తన కుమారుడికి కియాను రేఫ్ డోలాన్ అనే నామకరణం చేసినట్లు ఈ సందర్భంగా పేర్కొంది. కాగా ఈ దంపతులకు ఇప్పటికే మగ బిడ్డ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బిడ్డ కూడా వచ్చాడు. ఈ పోస్ట్ చూసిన ప్రియులు…. హీరోయిన్ ఇలియానా కు కంగ్రాట్స్ చెబుతున్నారు.