మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప. ఈ సినిమా శుక్రవారం రోజున విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇందులో మంచు విష్ణుతో పాటు పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కూడా నటించారు. కాగా, ఈ సినిమా విడుదలైన రెండు రోజులలోనే బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప సినిమా దాదాపు రూ. 42.5 కోట్ల కలెక్షన్లు వసూలు చేసినట్లుగా సినీ వర్గాలు వెల్లడించాయి.

మొదటి రోజు రూ. 20 కోట్లు, రెండో రోజు రూ 22.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లుగా సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, ఈరోజు ఆదివారం కావడంతో కన్నప్ప సినిమా కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని మూవీ యూనిట్ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. కన్నప్ప సినిమా తొందర్లోనే రూ. 50 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. కాగా, ఈ సినిమాలో మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, విష్ణు, ప్రభాస్ తో సహా మరి కొంత మంది సినీ నటీమణులు కీలక పాత్రలను పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను హీరో విష్ణు ఎంజాయ్ చేస్తున్నారు.