నితిన్ హీరోగా నటించిన తాజా చిత్రం కితమ్ముడు’. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో పవర్ ఫుల్ డైలాగ్, మ్యూజిక్, ఫైట్ సన్నివేశాలు ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచుతున్నాయి. సినిమా ట్రైలర్ చూశాక ‘తమ్ముడు’ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయని నితిన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బోల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటి లయ కీలక పాత్ర పోషించింది. కాగా, తమ్ముడు సినిమా ఈ నెల 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం నితిన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం నితిన్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా నటించిన రాబిన్ ఫుడ్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమా అయినా సక్సెస్ అందుకోవాలని నీతిని అభిమానులు కోరుకుంటున్నారు.