చాలా శాతం మంది బరువు తగ్గడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో రకాల డైట్లను పాటిస్తూ వ్యాయామాలను చేయడం వలన బరువు పెరగకుండా ఉంటారు. కాకపోతే కొన్ని సందర్భాలలో సమయం లేకపోవడం వలన రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు బరువు పెరిగిపోతారని భయంతో ఆలోచిస్తూ ఉంటారు. అయితే బయట తినడం వలన వెయిట్ లాస్ జర్నీకి ఆటంకం కూడా కలుగుతుంది. అటువంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వలన బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చు. రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు బరువు తగ్గాలనుకుంటే ఈ చిట్కాలను ప్రయత్నించండి.
రెస్టారెంట్ కు ప్లాన్ గా వెళ్ళినప్పుడు సాధారణ ఆకలితో మాత్రమే వెళ్ళి కార్బోహైడ్రేట్లు మరియు కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. బాగా ఆకలితో రెస్టారెంట్ కు అస్సలు వెళ్ళకూడదు. ఎప్పుడైతే రోజంతా సరిగ్గా తినకుండా రెస్టారెంట్ కి వెళ్తారు, అనవసరంగా ఎక్కువ క్యాలరీలను తీసుకుంటారు. కనుక అటువంటి సందర్భాలలో రెస్టారెంట్ కు వెళ్లకపోవడం మేలు. చాలా శాతం మంది భోజనం ప్రారంభించే ముందు కాక్టైల్ వంటివి తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వలన దాహం తీరుతుంది, కాకపోతే దీనివల్ల అనవసరమైన క్యాలరీలు చేరుతాయి. కాక్టైల్ కు బదులుగా పెద్ద గ్లాస్ మంచి నీరుని తాగాలి. ఇలా చేయడం వలన ఎక్కువ ఆహారాన్ని తీసుకోరు మరియు దాహం కూడా తీరుతుంది. కాక్టైల్ వంటి వాటిని తాగాలంటే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తాగుతూ ఉండాలి.
అంతేకాకుండా రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు మెనూ లో ఉన్నది ఉన్నట్టుగా అస్సలు ఆర్డర్ చేయకూడదు. ఎక్కువగా ఉపయోగించే బ్రెడ్, సాస్, డ్రెస్సింగ్ లు వలన క్యాలరీలు ఎక్కువ పెరుగుతాయి. అటువంటి సమయంలో క్యాలరీలను తగ్గించుకోవాలంటే రెస్టారెంట్ కు వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసే ముందు ఆరోగ్యకరంగా ఉండే విధంగా చూసుకోవాలి. బ్రెడ్ మరియు వెన్న వంటివి ఉపయోగించవద్దు అని చెప్పాలి మరియు కూరగాయలను వేయించడం బదులుగా ఆవిరిలో ఉడికించి తీసుకురమ్మని అడగాలి. ఇలా చేయడం వలన రుచితో పాటుగా క్యాలరీలు కూడా తగ్గుతాయి. చాలామంది డబ్బులు ఖర్చు చేస్తున్నామని ఎక్కువ తినాలని ఆలోచిస్తారు. కాకపోతే 80 శాతం కడుపు నిండిన తర్వాత ఆహారాన్ని తీసుకోవడం ఆపేయాలి. .