తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం.. గణనీయంగా పెరుగుతోంది. గడిచిన జూన్ మాసంలో… 100 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది. జూన్ మాసంలో స్కూలు అలాగే కాలేజీలకు వేసవి సెలవులు ముగిసిన సంగతి తెలిసిందే. అయితే సెలవులు ముగుస్తాయి అన్న… నేపథ్యంలో పిల్లలను తీసుకొని చాలామంది తల్లిదండ్రులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది.

దీంతో జూన్ మాసంలో తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. జూన్ మాసంలో మొత్తం 24 లక్షల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే ఒక్క రోజుకు దాదాపు 80 వేల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. 14వ తేదీ అత్యధికంగా 91 వేల మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 119 కోట్లకు చేరింది. కాగా మే నెలలో 106 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది.