పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తాజాగా కొత్త లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చారు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న “ఫౌజీ” సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రభాస్ ఓ అభిమానితో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రభాస్ కి సంబంధించి ఇలాంటి లుక్ రాలేదని ఈ ఫోటోలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వింటేజ్ రెబల్ ఈజ్ బ్యాక్ అని పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది ప్రభాస్ వయసు పెరిగినప్పటికీ అంతే హ్యాండ్సమ్, ఫిట్నెస్ తో కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు తన అభిమానుల ముందుకు ఏదో ఒక సినిమాతో వస్తు సక్సెస్ తన ఖాతాలో వేసుకుంటున్నారు.