వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సిందే..!

-

వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు వలన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. అటువంటి సందర్భాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో లభించేటువంటి పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం వలన సూక్ష్మజీవులు ఎక్కువగా పెరుగుతాయి. అంతే కాకుండా నీటి కాలుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక వ్యాధులు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలను తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. వర్షాకాలంలో లభించే పండ్లను తినడం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. నేరేడు పండ్లు, బొప్పాయి, దానిమ్మ, యాపిల్, చెర్రీస్ వంటివి తీసుకోవడం వలన శరీరానికి తగిన ఫైబర్ అందుతుంది మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. ఈ విధంగా జీర్ణవ్యవస్థకు ఎంతో సహాయం పడతాయి. కాకపోతే పండ్లను తీసుకునే ముందు బాగా శుభ్రం చేసుకుని, అవసరమైతే తొక్క తీసుకొని తినాలి.పండ్లతో పాటుగా వర్షాకాలంలో లభించే కాకరకాయ, పొట్లకాయ, సొరకాయ, బెండకాయ, టమాటాలు వంటివి తీసుకోవాలి.

ఇటువంటి కూరగాయలను తీసుకోవడం వలన తక్కువ క్యాలరీలతోనే ఎక్కువ పోషక విలువలను పొందవచ్చు. వీటితో పొటాషియం, మెగ్నీషియం శరీరానికి పుష్కలంగా అందుతుంది. ఈ విధంగా జీర్ణవ్యవస్థకు ఎంతో సహాయపడుతుంది మరియు మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా వర్షాకాలంలో ఆహారాన్ని వేడిగా తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కనుక అల్లం, యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు, జాజికాయ వంటి మొదలైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది మరియు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news