క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిందే..!

-

చాలా శాతం మంది ఎక్కువ ఖర్చులు అవుతున్నప్పుడు క్రెడిట్ కార్డు వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజుల్లో క్రెడిట్ కార్డును చాలా శాతం మంది ఉపయోగిస్తున్నారు. కాకపోతే వాటిని మెయింటైన్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా ఎంతో త్వరగా పూర్తి అవుతోంది. కనుక, క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను పెంచుకోవాలంటే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ప్రతి చిన్న ఖర్చుకు కూడా క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తే, చెల్లింపులు చేయడానికి ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది మరియు ఒక కార్డుకు సంబంధించిన లిమిట్ కూడా పూర్తవుతుంది. కనుక, క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుకోవాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

క్రెడిట్ కార్డు ను కేవలం అవసరమైన ఖర్చులకు మాత్రమే ఉపయోగించాలి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చేటువంటి ఆర్థిక అవసరాల కోసం క్రెడిట్ కార్డును వినియోగించడం వలన ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అంతేకాకుండా, వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు క్రెడిట్ కార్డు ను ఉపయోగించడం వలన క్రెడిట్ కార్డ్ పరిమితి పెరుగుతుంది. ఈ విధంగా మంచి క్రెడిట్ స్కోర్‌ ను కలిగి ఉండటం వలన ఎటువంటి రుణాలనైనా ఎంతో సులభంగా పొందవచ్చు. ముఖ్యంగా బ్యాంకు లేక ఆర్థిక సంస్థలు రుణాలను అందించేటప్పుడు క్రెడిట్ హిస్టరీ మరియు క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకుంటారు మరియు దాని ప్రకారం రుణాలను అందిస్తారు.

కనుక, ఎంతో త్వరగా రుణాలను పొందాలంటే క్రెడిట్ లిమిట్‌ను ఎక్కువగా ఉంచుకోవాలి మరియు క్రెడిట్ పెంచుకోవాలి. అయితే, క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవడానికి 6 నుండి 12 నెలల పాటు చెల్లింపు హిస్టరీని నిర్వహిస్తారు. ఈ విధంగా క్రెడిట్ పరిమితి అభ్యర్థన కోసం బ్యాంకు దరఖాస్తు చేసుకున్న తర్వాత క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవచ్చు. దీనిని మొబైల్ యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్, లేక ఫోన్ కాల్ రిక్వెస్ట్ ద్వారా చేయవచ్చు. ఈ విధంగా క్రెడిట్ స్కోర్‌ను పెంచుకోవచ్చు. పూర్తి హిస్టరీని తెలుసుకున్న తర్వాత, అభ్యర్థన చేసిన వారిలో అర్హులకు మాత్రమే క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news