ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని అందరూ జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం గురు పౌర్ణమి జూలై 10వ తేదీన రావడం జరిగింది. గురుపౌర్ణమి రోజున గురువుకు భక్తిని తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా గురువును గురు పౌర్ణమి రోజున ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది అని అందరూ నమ్ముతారు. ముఖ్యంగా పితృ దోషం, గురు గ్రహం యొక్క చెడు ఫలితాలు తొలగిపోవాలంటే తప్పకుండా గురు పౌర్ణమి రోజున ఆరాధించాలి అని పండితులు చెప్తున్నారు. ఆరాధించడంతో పాటుగా గురు పౌర్ణమి రోజున గురువుకు కొన్ని వస్తువులను సమర్పించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఈ విధంగా కృతజ్ఞతను కూడా తెలియజేయవచ్చు.
హిందూ పురాణాల ప్రకారం గురువును భగవంతునితో సమానంగా చూడాలి. అందువలన కచ్చితంగా గురు పౌర్ణమి రోజున గురువును ఆరాధించాలి మరియు ఈ వస్తువులను గురువుకు ఇవ్వాలి. గురువుకు పసుపు రంగు దుస్తులను ఇవ్వడం వలన గురు గ్రహానికి సంబంధించిన చెడు ఫలితాలు తొలగిపోతాయి. ఈ విధంగా పసుపు రంగు వస్త్రాలను ఎప్పుడైతే గురువుకు దానం చేస్తారో, జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా కెరియర్‌లో విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. పసుపు రంగు ఎంతో శుభప్రదమైనది. అందువలన పసుపు రంగులో ఉండేటువంటి స్వీట్లను గురువుకు ఇస్తే ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా గురుగ్రహం అనుకూలంగా ఉండాలంటే పసుపు రంగు స్వీట్లను కచ్చితంగా అందించాలి. ఇలా చేయడం వలన మీ పనులన్నీ పూర్తవుతాయి మరియు పితృ దోషాలు కూడా తొలగిపోతాయి.
పసుపు రంగు స్వీట్లు మాత్రమే కాకుండా పసుపు రంగులో ఉండే పండ్లను కూడా గురు పౌర్ణమి రోజున గురువుకు ఇవ్వచ్చు. మామిడి పండ్లు, అరటి పండ్లు వంటివి గురువుకు ఇవ్వడం వలన గురు గ్రహానికి సంబంధించిన అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇలా చేయడం వలన అదృష్టం, కీర్తి కూడా పెరుగుతాయి. గురు గ్రహం అనుగ్రహాన్ని పొందాలంటే తప్పకుండా చామంతి పూలు, సంపంగి పూలు వంటి వాటిని గురువుకు ఇవ్వాలి. వీటితో పాటుగా గురువుకు పసుపును కూడా ఇవ్వచ్చు. పసుపు ఎంతో శుభప్రదం మాత్రమే కాకుండా స్వచ్ఛతకు కూడా చిహ్నం. అందువలన పసుపును సమర్పించడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే పేదరికం, అడ్డంకులు వంటివి పూర్తిగా తొలగిపోయి ఎంతో ఆనందంగా జీవిస్తారు.