Mohammed Shami Wife: నాకు నెలకు రూ. 10 లక్షలు ఇవ్వాల్సిందే ?

-

 

Mohammed Shami Wife: భారత పేసర్ మహ్మద్ షమీ తన భార్య, కూతురు సంరక్షణ కోసం నెలకు రూ.4 లక్షలు భరణం కింద చెల్లించాలని కోల్‌కతా హై కోర్టు ఆదేశించింది. షమీ స్థాయికి ఈ భరణం చాలా తక్కువ అని.. మేం రూ. 10 లక్షల వరకు కోరామని వ్యాఖ్యానించారు షమీ మాజీ భార్య హసీన్ జహాన్. భార్య హసీన్ జహాన్ కోసం నెలకు రూ. 1.5 లక్షలు, కుమార్తె కోసం నెలకు రూ.2.5 లక్షలు షమీ ఇవ్వాలని ఆదేశించింది కోల్‌కతా హైకోర్టు.

mohammed shami wife
mohammed shami wife

2018లో విడాకులు తీసుకున్నారు మహమ్మద్ షమీ, హసీన్ జహాన్. ఏడేళ్ల కిందటే మేం అతడి నుంచి నెలకు రూ.10 లక్షల వరకు ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. అప్పటి నుంచి అతడి ఆదాయం, ఖర్చులు కూడా పెరిగాయని వివరించారు. షమీ ఎలా తన జీవితాన్ని గడుపుతున్నాడో.. నేను, నా కుమార్తె కూడా అదే స్థాయిని కొనసాగించే హక్కు ఉందని వ్యాఖ్యానించారు భార్య హసీన్ జహాన్. రూ.4 లక్షలు భరణం చెల్లించాలనే కోర్టు ఆదేశాలపై స్పందించలేదు షమీ.

Read more RELATED
Recommended to you

Latest news