ఈ సంవత్సరం జూలై నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అధికారులు సూచనలు చేశారు. 1971-2020 గణాంకాల ప్రకారం జులై నెలలో సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లు కాగా ఈసారి అంతకన్నా ఎక్కువగా వర్షాపాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

ఈ శాన్య, తూర్పు, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఉండొచ్చని తెలిపారు. ఉష్ణోగ్రతలు చాలా చోట్ల సాధారణం కంటే తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాలు ఈ నెలలో అధికంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని IMD తెలిపింది. వర్షంతో పాటు గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.