తన కూతురు పొలిటికల్ ఎంట్రీపై మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. నా కూతురు ఆలోచనను మేము కాదనలేమన్నారు. తన భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు తనకు ఉందని వెల్లడించారు.

పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు భేటీ అయ్యారు. హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీనాక్షి నటరాజన్‌తో కొండా దంపతులు భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న అంశాలపై మీనాక్షికి నివేదిక ఇచ్చారు కొండా మురళి. అనంతరం కొండా మురళి మాట్లాడారు. నా కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయలేదని, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుందని వెల్లడించారు కొండా మురళి. నా కూతురు తొందరపడి అన్నదో.. ఆలోచించి అన్నదో నాకైతే తెలియదని వివరించారు కొండా మురళి.