తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. వచ్చే సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వాన్ని పడగొట్టి గెలవాలని అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. డీఎంకేతో పాటు బిజెపి.. అటు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగాయి. ఇలాంటి నేపథ్యంలో… తమిళ హీరో విజయ్ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

తమిళగా వెట్రీ కలగం TVK అనే పార్టీని కూడా స్థాపించారు హీరో విజయ్. ఈ పార్టీకి ప్రశాంత్ కిషోర్ కూడా వ్యూహకర్తగా ఉన్నారు. ఎలాగైనా స్టాలిన్ ప్రభుత్వాన్ని పడగొట్టి టీవీకే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టీవీ కే పార్టీ సీఎం అభ్యర్థిని తాజాగా ప్రకటించింది. విజయ్ పేరు నే ఫైనల్ చేస్తూ… కార్యనిర్వాహక మండలి తీర్మానం చేసింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది.