తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమలలోని జి ఎన్ సి దివ్య రామన్ నర్సరీ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘాటు రోడ్డు వరకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంటలు తమకు అంటుకుంటాయి అన్న భయంతో పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది… మంటలు వారిపై ప్రయత్నాలు చేస్తున్నారు.
మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా రెండు రోజుల కిందట తిరుపతిలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. గోవిందరాజు ఆలయ సమీపంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ తరుణంలో గోవింద స్వామి ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు… మంటలు కూడా అంటుకున్నాయి. ఈ సంఘటన మరువకు ముందు ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్డులో మరో అగ్ని ప్రమాదం జరిగింది.
తిరుమలలో మరో అగ్నిప్రమాదం
తిరుమలలోని జి.ఎన్.సి దివ్యరామం నర్సరీ వద్ద అగ్నిప్రమాదం, ఘాట్ రోడ్డు వరకు వ్యాపించిన మంటలు
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది https://t.co/uaUy031b0U pic.twitter.com/Iiw1Jz5ays
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025