18 అడుగుల కింగ్‌ కోబ్రా.. భయపడని లేడీ బీట్‌ ఆఫీసర్‌!

-

ఓ మహిళ ఆఫీసర్ పామును పట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా 18 అడుగుల పొడవైన పామును చాకచక్యంగా పట్టుకుంది. వివరాల్లోకి వెళితే… ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లా కట్టకడ రెసిడెన్షియల్ ప్రాంతంలో జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ రోషిని కేవలం నిమిషాలలోనే కింగ్ కోబ్రాను సంచిలో బంధించిన వీడియో హాట్ టాపిక్ గా మారుతోంది.

Kerala forest officer rescues 18-foot king cobra with bare courage, internet applauds bravery
Kerala forest officer rescues 18-foot king cobra with bare courage, internet applauds bravery

ఆమె పామును పట్టుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు. రోషిని చూపిన ధైర్య సాహసాలను చూసి స్థానికులు, అధికారులు, నెటిజన్లు తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహిళలు అన్ని రంగాలలో వారి ధైర్య సాహసాలను ఇలానే ప్రదర్శించాలని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news