ABN ఛానల్ మీద దాడి చేస్తే, మేము తెలంగాణ భవన్‌పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు హై టెన్షన్ నెలకొంది. హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసుల మోహరించారు. రాధాకృష్ణ తొలిపలుకు కథనం, బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ముందు పోలీసులు భద్రత కల్పించారు.

అయితే ఈ అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ABN మీద దాడి చేస్తే చుక్కలు చూపిస్తరు మావోళ్లు… మీకు అక్కడక్కడ 10 మంది ఉన్నరు..మావోళ్లు వందలమంది ఉన్నారని వార్నింగ్ ఇచ్చారు. ఇంకొక్కసారి బీజేపీవాళ్లను వాడు వీడు అంటే నీ కాన్వాయ్ రోడ్లమీద తిరగనియ్యం అని హెచ్చరించారు కేంద్రమంత్రి బండి సంజయ్.
ఏబీఎన్ ఛానల్ మీద దాడి చేస్తే, మేము తెలంగాణ భవన్‌పై దాడి చేస్తాము – బండి సంజయ్ pic.twitter.com/u5K0kYKhhG
— Telugu Scribe (@TeluguScribe) July 7, 2025