మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

-

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నోటీసులు జారీ చేశారు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.

Court issues non-bailable warrant to Minister Uttam Kumar Reddy
Court issues non-bailable warrant to Minister Uttam Kumar Reddy

గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసు విచారణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాకపోవడంతో, వారెంట్ జారీ చేసింది కోర్టు. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. ఇక 16వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని ఆదేశించింది నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news