హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి అలర్ట్. ఆస్పత్రిలో రెండు గంటలు ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో రెండు గంటలు ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా క్లెయిమ్ చేస్తున్నాయి. దీనిపై పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింగాల్ రియాక్ట్ అయ్యారు.

గత పది సంవత్సరాల నుంచి వైద్యరంగంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. గతంలో కొన్ని రకాల ఆపరేషన్లకు చాలా సమయం పట్టేది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో ఒకటి రెండు గంటలు మాత్రమే సమయం పడుతుందని పేర్కొన్నారు.