హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక సినిమాలలో నటిస్తున్న సమయంలోనే డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఇప్పటికే నయనతార సినిమాలలో నటిస్తూ తన సత్తాను చాటుకుంటుంది.

ఇదిలా ఉండగా… గత కొద్ది రోజుల నుంచి నయనతార తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై నయనతార రియాక్ట్ అయ్యారు. “మా గురించి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే” అని నయనతార తన భర్తతో కలిసి తీసుకున్న ఫోటోను ఇన్ స్టా స్టోరీగా పెట్టారు. దీంతో నయనతార విడాకుల విషయంపై క్లారిటీ వచ్చేసింది. వీరిద్దరూ 2022లో వివాహం చేసుకోగా ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తన భర్త, పిల్లలతో నయనతార ఎంతో సంతోషంగా తన కెరీర్ కొనసాగిస్తోంది.