ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే

-

ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లో నిర్మించాలని చూస్తున్న డ్రై పోర్టు నుండి మచిలీపట్నం పోర్టుకు రైలు మార్గం గురించి ప్రతిపాదన పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలపై ఇటీవల సమావేశం నిర్వహించింది కేంద్ర హోం శాఖ.

New Greenfield Express Highway from Fourth City to Amaravati
New Greenfield Express Highway from Fourth City to Amaravati

ఈ సమావేశంలో హైదరాబాద్ ఫోర్త్ సిటీ నుండి అమరావతి వరకు నూతన రహదారి నిర్మించాలని ప్రతిపాదించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, డీపీఆర్ రూపొందించాలని కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర హోం శాఖ. ఫోర్త్ సిటీని అమరావతిని కలిపేలాగా రహదారి ఉంటే బాగుంటందని ఏపీ అధికారాలకు వివరించారు తెలంగాణ అధికారులు. ఈ ప్రతిపాదనపై ఏపీ అధికారుల స్పందన కోసం వేచి చూస్తున్నారు తెలంగాణ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news