అగ్నిప్రమాదాలు జరగవచ్చు.. జాగ్రత్తగా ఉండాలన్నారు మాతంగి స్వర్ణలత. బోనాలు సంతోషంగా అందుకున్నా అంటూ.. భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత. నా బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుతున్నా అని చెప్పారు. అగ్నిప్రమాదాలు జరగవచ్చు.. జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో సంతోషంగా ఉంటారన్నారు. మహమ్మారి వస్తోందని.. రక్తం కక్కుకొని చనిపోతారని ఈ సందర్భంగా స్వర్ణలత పేర్కొన్నారు. తనకు ప్రతి ఏటా పూజలు బాగా చేయాలని.. వివరించారు. అగ్ని ప్రమాదాలు జరిగితే తానేమీ చేయలేనని తేల్చి చెప్పారు.
- ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం ప్రారంభం
- భవిష్యవాణి వినిపిస్తున్న స్వర్ణలత
- హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్