కల్వకుంట్ల కవిత అలాగే కల్వకుంట చంద్రశేఖర రావు పై మరోసారి తీన్మార్ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీ నాన్నను చెప్పుతో కొట్టు అంటూ కవితపై మండిపడ్డారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. కంచం పొత్తా లేదా మంచం పొత్తా… అంటూ చేసిన వ్యాఖ్యలపై తాజాగా మరోసారి తీన్మార్ మల్లన్న క్లారిటీ ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలు వాడుక భాషలో ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు తెలుగు సాహిత్య అకాడమీ రచించిన సామెతల పుస్తకంలో కూడా ఈ పదాలు ఉన్నాయని వెల్లడించారు. కెసిఆర్ కూడా దాన్ని ఆమోదించి… దాని గొప్పదనం పైన సందేశం కూడా ఇచ్చారని వెల్లడించారు. సిగ్గు లేదా అని మీ నాయన ను చెప్పుతో కొట్టు అంటూ కవితపై మండిపడ్డారు.