తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులను మహిళల పేరు మీదనే ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఆడబిడ్డలు ఆశీర్వాదం ఇస్తేనే ఇల్లు అయినా, ప్రభుత్వమైన చల్లగా ఉంటుందని ఆయన అన్నారు. అందుకే ప్రతి పథకంలో తమ ప్రభుత్వం ఆడపిల్లలకే అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు. రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ. 21 వేల కోట్లు జమ చేసామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గుర్తు చేశారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి. మరి కొంతమందికి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రేషన్ కార్డులు లేని మహిళలకు చాలామందికి కొత్తగా రేషన్ కార్డులు వచ్చాయి.